• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కామారెడ్డి కలెక్టర్ ను కలిసిన MLA రమణారెడ్డి

KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ కళాశాల భూముల అంశంపై రెఫరెండం సమర్పించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి పూర్తి నివేదిక విడుదల చేయాలని కలెక్టర్‌ను ఆయన కోరారు.

February 23, 2026 / 01:36 PM IST

సాగునీటి కోసం అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే

SKLM: మందస మండలంలో సాగునీటి ప్రాజెక్టుల పై అసెంబ్లీలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కళింగదల్, డబార్శింగి, దామోదర సాగర్ ప్రాజెక్టులను ఎన్టీఆర్ సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తీసుకొచ్చారన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 11 వేల 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులకు మరమ్మతులు అవసరం ఉందన్నారు.

February 23, 2026 / 01:35 PM IST

మా ఊరికి ఆ కంపెనీ వద్దు.. గ్రామస్థుల విన్నపం

MDK: టైర్ల నుంచి ఆయిల్, పౌడర్ తయారు చేసే పరిశ్రమను గ్రామంలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ చిన్న శంకరంపేట (M) కామారం గ్రామస్థులు అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామ శివారులో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

February 23, 2026 / 01:35 PM IST

కోడళ్లు రోడ్డున పడేసారని.. వృద్ధురాలి ఆవేదన..!

BHNG: కన్నతల్లిలా చూసుకోవాల్సిన కోడళ్లు తనను అనాథను చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వయసు మళ్ళిన కాలంలో అండగా ఉండాల్సిన వారే గడప దాటించడంతో, 81 ఏళ్ల వృద్ధురాలు న్యాయం కోసం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. సోమవారం భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆమె జిల్లా కలెక్టర్ హనుమంతరావును కలిసి గోడు వెల్లబోసుకుంది.

February 23, 2026 / 01:35 PM IST

కూసుమంచిలో 1460 బస్తాల యూరియా సిద్ధం

KMM: కూసుమంచి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో, సొసైటీలలో సోమవారం 1460 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఏవో అధికారిణి రామడుగు వాణి తెలిపారు. చేగొమ్మ సొసైటీలో 445, ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద 270 బస్తాలు, అన్నదాత పర్టిలైజర్‌లో 270, మనగ్రోమోర్‌లో 445 బస్తాలు, మొత్తం 1430 యూరియా బస్తాలు ఉన్నాయన్నారు.

February 23, 2026 / 01:35 PM IST

ఏటీఎం కార్డులు మార్చేసి డబ్బులు కాజేసిన వ్యక్తి అరెస్ట్

AKP: నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేసిన కేటుగాడిని టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు కథనం ప్రకారం సుకల నూకరాజు అనే వృద్ధుడు డబ్బులు కోసం ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మువ్వ వీరయ్య చౌదరి అనే పాత నిందితుడు ఏటీఎం కార్డు మార్చేసి రూ. 15 వేలు కొట్టేసాడన్నారు.

February 23, 2026 / 01:34 PM IST

UTS స్థానంలో RailOne యాప్

భారతీయ రైల్వే శాఖ మార్చి 1వ తేదీ నుంచి పాత UTS యాప్‌ను నిలిపివేయనుంది. దాని స్థానంలో సరికొత్త ‘RailOne’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త యాప్ ద్వారా రిజర్వేషన్ అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్‌తో పాటు రైలు లైవ్ స్టేటస్ వంటి అన్ని సేవలను ఒకేచోట సులభంగా పొందవచ్చు. ఇది ప్రయాణికులకు ఏకీకృత డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది.

February 23, 2026 / 01:33 PM IST

రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహబూబ్ సుభాన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. గంజహళ్లి ఉరుసు మహోత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

February 23, 2026 / 01:32 PM IST

పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

ఏలూరు నగరంలోని పలు కాలేజీలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 01:32 PM IST

అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు.భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

February 23, 2026 / 01:32 PM IST

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్ల సందర్శన

సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల అమ్మకాల పరిస్థితిపై ఆరా తీశారు. చేనేత ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారుల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు ప్రోత్సాహం అందించారు.

February 23, 2026 / 01:31 PM IST

ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్

KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

February 23, 2026 / 01:30 PM IST

వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం

KNR: చొప్పదండి ఎంపీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. ఈనెల 23 నుంచి 27 వరకు ఆర్నకొండ, భూపాలపట్నం, చాకుంట, దేశాయిపేట, పెద్ద కురువపల్లి, మంగళపల్లి, రాగంపేట, రేవెల్లి, మార్చి 2 నుంచి మార్చి 7 వరకు చిట్యాలపెళ్లి, గుమలాపూర్, కాట్నపల్లి, కొలిమికుంట, రుక్మాపూర్ వారికి శిక్షణ ఉంటుందన్నారు

February 23, 2026 / 01:30 PM IST

సర్పంచుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం నూతన సర్పంచుల సంఘం కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ కృష్ణ నాయక్, అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షులు వెంకటరం, మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో పలువురు వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.

February 23, 2026 / 01:30 PM IST

‘ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుంది’

MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.

February 23, 2026 / 01:30 PM IST