• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి సమావేశం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశాన్నీ సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులు నిర్ణయించారు. మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో MLA గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. .

February 23, 2026 / 01:52 PM IST

రేపటి నుంచి జగన్‌ పులివెందుల పర్యటన

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపటి నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్‌ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎల్లుండి వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రజాదర్బార్‌కు హాజరవుతారు.

February 23, 2026 / 01:48 PM IST

కంటి వైద్య శిబిరంతో గ్రామీణులకు మెరుగైన చూపు: ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు: కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఆశయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాంతా బయోటెక్నిక్స్‌ ఫౌండర్‌ వర ప్రసాద్‌రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయులని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టిపి గూడూరు మండలం ఇస్కపాలెంలో శాంత-వసంత ట్రస్తు, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

February 23, 2026 / 01:47 PM IST

త్వరలో తిరుమలలో కొత్త చట్టం!

AP: సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఈ క్రమంలో స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 01:46 PM IST

ప్రజా వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

KRNL: కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 23, 2026 / 01:45 PM IST

స్వయం ఉపాధి ద్వారా మహిళలకు ఆర్థిక బలం

JN: పాలకుర్తి మండలం దుబ్బా తండాగ్రామానికి చెందిన భూక్య వెన్నలాకు సంచార చేపల విక్రయ వాహనాన్ని సోమవారం అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ మహిళలకు ఆర్థిక బలం అందిస్తున్నాయని, మహిళలు వాటి ద్వారా కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించగలరని తెలిపారు.

February 23, 2026 / 01:43 PM IST

పాఠశాలకు ఆట వస్తువుల వితరణ

NLG: విద్యార్థుల ఉల్లాసం కోసం ఏపూర్ 1వ వార్డు సభ్యులు వెంకటేశం తమ ఉదారతను చాటుకున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఆయన ఆట వస్తువులను సమకూర్చారు. వీటిని సర్పంచ్ పాలెం మహేష్ చేతుల మీదుగా సోమవారం విద్యార్థులకు అందజేశారు. పాఠశాల సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు హెచ్‌ఎం అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

February 23, 2026 / 01:41 PM IST

బాఫ్టా 2026: ఉత్తమ నటుడు రాబర్ట్ అరమాయో ఎవరు?

ఏడేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన రాబర్ట్ అరమాయో 2026 బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా నిలిచారు. ఐ స్వేర్ చిత్రంలోని నటనకు గాను లియోనార్డో డికాప్రియోను ఓడించి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రముఖ సిరీస్‌లలో నటించిన ఆయన, అమెరికాలో ప్రత్యేక నటనా శిక్షణ పొంది తన ప్రతిభను చాటుకున్నారు.

February 23, 2026 / 01:41 PM IST

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం: కరుణాకర్

BHPL: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ వద్ద SSA ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులకు సోమవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరంలో BHPL జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.

February 23, 2026 / 01:41 PM IST

సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం: MLA

JN: నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లింగాల గణపురం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

February 23, 2026 / 01:39 PM IST

శాసనమండలి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు

కాకినాడ: డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రెండు రోజుల క్రితం శాసనమండలి నుంచి ఒంటరిగా వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ఆయన సోమవారం మండలికి విచ్చేశారు. సభలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో ఆయన సమావేశమైనట్లు సమాచారం.

February 23, 2026 / 01:38 PM IST

కాంగ్రెస్ పథకాలను ప్రతి మహిళకు చేరవేయాలి: ఛైర్మన్

MLG: జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలు తమ మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించి కాంగ్రెస్ పథకాలను ప్రతి మహిళకు చేరవేయాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు.

February 23, 2026 / 01:38 PM IST

కనువిందుగా రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణ వేడుక సోమవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవలతో ప్రారంభమైన పూజలు అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య బేడ మండపానికి తీసుకువచ్చి, విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, కంకణధారణ వంటి శాస్త్రోక్త కార్యక్రమాల అనంతరం అర్చకులు నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు.

February 23, 2026 / 01:37 PM IST

మార్కెట్ యార్డు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కు వచ్చే మహిళ రైతులకు ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

February 23, 2026 / 01:37 PM IST

కీసరగుట్టలో యాంకర్ సుమ

MDCL: కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారిని ఆదివారం యాంకర్ కనకాల సుమ రాజీవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ పూజారులు రవి శర్మ, రమేశ శర్మ, ప్రణీత్ శర్మ ఆశీర్వదించి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కుమారుడు తటాకం అభిలాష్ శర్మ ఉన్నారు.

February 23, 2026 / 01:36 PM IST