విజయనగరంలోని నందివీధిలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ వారి (గద్ది) 12వ వార్షిక మహోత్సవాలు ఇవాళ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ మహోత్సవాల్లో నెల్లిమర్ల నియోజవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతులు మీదగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
MNCL : జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గాజుల సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న చత్రపతి శివాజీ యూత్ సభ్యులు రూ. 5000, 25 కేజీల రైస్ బ్యాగ్ బుధవారం అందజేసి, మంచి మనసును చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: పెనమలూరు (M) తాడిగడప జిల్లా పరిషత్ హై విద్యార్థులు బుధవారం అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. చట్ట సభల్లో చట్టాలను రూపొందించడం, అమలు పరచడం, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించే తీరును స్వయంగా వీక్షించడంత విద్యార్థులు అనుభూతి చెంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోదే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
HYD పోలీసులు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ ఆధునిక పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ముందడుగు వేశారు. ఇంటర్న్‌షిప్, వాలంటరీ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. 25 సం.రాల లోపు డిగ్రీ, పీజీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://form.jotform.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
ఇటీవల ‘ది రాజాసాబ్’ మూవీతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు మారుతి మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే ఓ కామెడీ కథను సిద్ధం చేసినట్లు, హీరో కోసం వెతుకులాట స్టార్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
W.G: కలెక్టర్ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు.
NRPT: కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామ శివారులోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టుబడింది. వాహనాల పరిశీలనలో ఎన్టీపీ 9 రకానికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్ నాయక్, సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
AP: మార్కాపురంలో భూ సమస్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ప్రజల భూములు 22A కింద పెట్టి.. ఇబ్బందులు పెట్టారు. గతంలో జగన్ ఫొటోలతో పట్టాదారు పాస్‌బుక్కులు ఇచ్చారు. నేను వచ్చాక ప్రభుత్వ రాజముద్రతో పాస్‌బుక్కులు ఇస్తున్నాం. కలెక్టర్లు, రెవెన్యూవారికి ఏడాది సమయం ఇచ్చా. పేదల భూ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’ అంటూ హామీ ఇచ్చారు.
సత్యసాయి: రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు కీలక శాఖ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ASR: పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం అరకు మండల కార్యదర్శి రామారావు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దశరథ్ కోరారు. బుధవారం బస్కి పంచాయతీలో పర్యటించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో నిరసన తెలిపారు. పెంచిన రూ.1లక్ష చెల్లించాలని కోరుతూ ఈనెల 27న నిర్వహించనున్న ఛలో ఐటీడీఏ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
ATP: సోలార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ సెంటర్‌లో సోలార్ విద్యుత్ సమస్యలను సైతం ఫిర్యాదు చేసే స్కౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు.
HYD: 1996 జీవో 570 ప్రకారం జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగలేదని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖకు మూడు వారాల గడువు మంజూరు చేసింది. నిర్ణీత సమయంలో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించింది. దీంతో సమాధానంపై GHMC, పురపాలక శాఖ పకడ్బందీగా కసరత్తు చేస్తూ నిర్విరామంగా కష్టపడుతోంది.
మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. రహదారి ప్రమాదాలు విధి రాత కాదని, మన నిర్లక్ష్య ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ దేశంలో 450 మంది ప్రమాదాల్లో మరణించడం ఆందోళనకరమని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని మరియు ట్రాఫిక్ నియమాలు పాటించాలని విద్యార్థులకు సూచించారు.
అన్నమయ్య: సంబేపల్లి(మం) దుద్యాల గ్రామంలోని కొండ కింద పల్లెలో నూతన రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ ఘనంగా జరిగింది. TDP నేత మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. రాయచోటి నియోజకవర్గంలో 39 ఆలయాల కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్టు రూ. 6.7 కోట్లు మంజూరు చేసిందని, అందులో భాగంగా ఈ రామాలయానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
TG: రాష్ట్రంలో అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంటల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సహాయం అందించాలన్నారు.