• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రక్షణ కల్పించాలని ఎస్సైకు వినతి

KRNL: పెద్దకడబూరు మండలంలో దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దళితులకు రక్షణ కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆశీర్వాదం, సుమల రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌లో ఎస్సై నిరంజన్ రెడ్డికు వినతి అందజేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ, ప్రాణహాని ముప్పు ఉన్న నాయకులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

February 24, 2026 / 08:24 PM IST

రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

VZM: సీఎం నారా చంద్రబాబు నాయుడుని మంగళవారం అమరావతిలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కలిశారు. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా, బొబ్బిలి దాడితల్లి అమ్మవారు ఉత్సవాన్ని పురస్కరించుకుని బొబ్బిలిలో రోడ్లు అభివృద్ధి కోసం రూ2.0 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

February 24, 2026 / 08:23 PM IST

బాధిత కుటుంబానికి CMRF చెక్కు పంపిణీ

WNP: రేవల్లి మండల తలుపునూరు గ్రామానికి చెందిన కౌసల్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా రూ. 32 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మంగళవారం ఎమ్మెల్యే వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.

February 24, 2026 / 08:23 PM IST

వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

NTR: చందర్లపాడు మండలం చింతలపాడులో ట్రాక్టర్ ప్రమాదంలో కుమారున్ని కోల్పోయిన షేక్ షాకీర్ కుటుంబానికి పట్టణ వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులకు దుస్తులు, 10వేల రూపాయల నగదును అందించి ఆయన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:23 PM IST

పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకం

RR: పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ముచ్చింతల్ గ్రామ పరిధిలో ఉన్న స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తులకు సేవ చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు.

February 24, 2026 / 08:22 PM IST

అశోక థియేటర్ చౌరస్తాలో ఆటోమేటిక్ సీసీ కెమెరాల ఏర్పాటు

HNK: జిల్లా కేంద్రంలోని అశోక థియేటర్ చౌరస్తాలో ఆటోమేటిక్ సిసి కెమెరాలను ఆర్టీసీ వరంగల్ టు డిపో అధికారులు మంగళవారం ప్రారంభించారు. అశోకా థియేటర్ చౌరస్తా మీదుగా వాహన రాకపోకలు సాగించేవారు. నిబంధనలను అతిక్రమిస్తే కెమెరాలు పసిగట్టి ఈ చాలాన్ ఇంటికి పంపించడం చేస్తాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.

February 24, 2026 / 08:22 PM IST

మీడియా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

అన్నమయ్య: 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ నిశాంత్ కుమార్ మంగళవారం అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. మొదటి సమావేశంలో ఆమోదం పొందిన 267 మంది పాత్రికేయులకు కార్డులు జారీ కాగా, మిగిలిన దరఖాస్తులను తదుపరి సమావేశంలో పరిశీలించనున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 08:21 PM IST

డీవార్మింగ్ మాప్-అప్ డేను పర్యవేక్షించిన DMHO

PPM: డీవార్మింగ్ డీవార్మింగ్ మాప్-అప్ డే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు జోగింపేట, కెజిబివి పాఠశాలలో మంగళవారం ఆర్.బి.ఎస్.కె అధికారి డా టి. జగన్ మోహనరావుతో కలిసి పర్యవేక్షణ చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏవైనా కారణాలచే ఆల్బెండజోల్ మాత్రలు వేయబడని విద్యార్థులు ఎంత మంది ఉన్నారు, అందుకు గల కారణాలు తెలుసుకున్నారు.

February 24, 2026 / 08:20 PM IST

KTRకు చామల స్ట్రాంగ్ కౌంటర్

TG: మాజీమంత్రి KTRకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘చట్టాల గురించి CM రేవంత్, DGP శివధర్ రెడ్డికి.. KTR చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్, పింక్ బుక్, ఖాకీ బుక్ గురించి KTR మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖాకీ బుక్ ఎప్పటికీ ఉంటుంది. BRS హయాంలో పోలీసులను ఏ విధంగా వాడుకున్నారో మీ చెల్లి చెప్పారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు’ అని పేర్కొన్నారు.

February 24, 2026 / 08:20 PM IST

9వ తరగతి విద్యార్థి అదృశ్యం

VKB: ఆలంపల్లికి చెందిన ప్రణీత్ అనే 9వ తరగతి విద్యార్థి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ప్రణీత్, పాఠశాలకు చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 98485 99876 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

February 24, 2026 / 08:19 PM IST

ద్విచక్ర వాహనదారుడిని సన్మానించిన ఎస్సై

NRML: పెంబి మండలంలోని మందపల్లి శివారులో ఎంపీ ఎస్సై హనుమాన్లు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారుడు సరైన అనుమతి పత్రాలు అన్ని సవ్యంగా ఉంచుకుని, హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ఇదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.

February 24, 2026 / 08:18 PM IST

జిల్లా కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

తిరుపతి దామినేడు సమీపంలో జిల్లా కోర్టు నిర్మించనున్న ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అలాగే మార్చి 1న నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ముందస్తు ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పీ సుబ్బారాయుడు, మూడవ అదనపు జడ్జి ఎం. గురునాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:17 PM IST

‘అర్హులకు వికలాంగుల పెన్షన్ అందించాలి’

KDP: నగరంలోని ఖలీల్ నగర్లో ఇబ్బందులు వికలాంగ చిన్నారులకు పెన్షన్ అందించాలని వైసీపీ సీనియర్ నేత సుభాన్ బాషా కోరారు. తన స్నేహితుల ద్వారా మతిస్థిమితం లేని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించ్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కుటుంబానికి బియ్యం, సరుకులు రూ.10 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.

February 24, 2026 / 08:17 PM IST

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య!

MDK: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎల్లమ్మ(49) కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుంది. సోమవారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన ఆమె మంగళవారం ఇంట్లో ఉరివేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 08:16 PM IST

బిగ్ బ్రేకింగ్.. పోలీసుల పేరుతో భారీ మోసం

BDK: బూర్గంపాడు మండలంలో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి గిరిజన మహిళ నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 24, 2026 / 08:16 PM IST