NRML: కుబీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరిడెంట్ విజయ్ భాస్కర్, DO నర్సయ్య తెలిపారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం జనరల్ 132, ఒకేషనల్ 27 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 112 మంది విద్యార్థులు హాజరు అవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు.
MBNR: జిల్లాలో SSC,ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.
SRCL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్ ఆది శ్రీనివాస్‌ను అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధితో ఆశీర్వదించారన్నారు.
GNTR: నిర్మాణాలు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతించిన ప్లాన్ ప్రకారమే ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. మంగళవారం శ్యామలానగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను ఆయన పరిశీలించారు. పనులు ప్లానింగ్‌కు అనుగుణంగా సాగేలా కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
NZB: TUలోని తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, విభాగాధిపతిగా వ్యవహరించారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందించారు.
WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా పర్యాటక అధికారి నరసింహ మంగళవారం పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాలేశ్వరయ్య (రూ. 12 వేలు), స్వామి (రూ.21 వేలు), షామా (రూ.9 వేలు)లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అందజేశారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఆమెకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.50,462 మంజూరయ్యాయి. బాధితురాలి సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఎంపీ తెలిపారు.
BPT: సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. విలువైన వస్తువులు దాచుకునేందుకు లాకర్ రూమ్ ఉన్నా అధికారులు దానిని ఇంకా తెరవలేదు. పంచాయతీ అధికారులు వేలం నిర్వహించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో పర్యాటకులు తమ సామాన్లను ఇసుకలోనే ఉంచాల్సి వస్తోంది. కొన్నిసార్లు వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రాంబాబు మృతి చెందడంతో ఆయన వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, భార్య దిక్కులేని వారయ్యారు. ఈ విషాద సమయంలో తామున్నామంటూ భరోసా ఇస్తూ మిత్రులందరూ కలిసి ఇవ్వాళ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
PLD: వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. 12 డిపోలను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థే సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, తమ సిబ్బందితో నడపాలని నేతలు శ్రీనివాసరావు, సౌభాగ్యరాజు డిమాండ్ చేశారు. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దన్నారు.
KMR: బాన్సువాడ పట్టణంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను పరిశీలించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఎలాంటి చిన్న ఘటన కూడా చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మండలంలోని చింతలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో గ్రామాలకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
కృష్ణా: అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్రంలో వెటర్నరీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి పశువైద్యశాల ఏర్పాటు చేసి తగిన డాక్టర్లను నియమించాలని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న NTR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రహరీ దుస్థితిలో ఉందని, నిధులు కేటాయించి ఆధునీకరించాలని కోరారు.
PDPL: ప్రైవేటు ఆసుపత్రిలో నెలలు నిండక ముందు జన్మించిన నవజాత కవల పిల్లలకు PDPL ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అత్యుత్తమ చికిత్స అందించి బాగు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఈనెల 6న అడ్మిట్ చేసుకుని డా. వాసుదేవరావు నేతృత్వంలో చికిత్స అందించి ఇవాళ డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. శ్రీధర్ వైద్యులను అభినందించారు.