• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి

TG: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం శక్తిమంతమైన ప్రదేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే  నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

February 24, 2026 / 02:32 PM IST

‘పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు’

ASF: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా SP నితిక పంత్ మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్ లు తీసుకోని రావద్దన్నారు.

February 24, 2026 / 02:32 PM IST

‘ప్రతి రైతుకి ఫార్మర్ ఐడీ తప్పనిసరి’

MBNR: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు అందాలంటే ఫార్మర్ ఐడీ అనేది తప్పనిసరి అని మహమ్మదాబాద్ మండలం నంచర్ల క్లస్టర్ ఏఈవో మౌనిక తెలియజేశారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఫార్మర్ ఐడీని పొందడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు వేదిక దగ్గరికి రావాలన్నారు.

February 24, 2026 / 02:32 PM IST

కాశీయాత్రికులకు మాజీ ఎంపీ సన్మానం

WNP: పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు మంగళవారం కాశీ యాత్రకు బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వారికి పూల బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కాశి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని రావుల శుభాకాంక్షలు తెలిపారు. 

February 24, 2026 / 02:32 PM IST

అవినీతి అధికారుల గుండెల్లో ACB రైడ్లు..!

కడప: జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో ACB రైళ్లు పరిగెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఐదుగురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పటివరకు ఏసీబీకి పట్టుబడిన వారిలో అందరూ ఉన్నతస్థాయి ఉద్యోగులే. కేవలం నెలరోజుల్లోనే ఐదుగురు పట్టుబడటంతో జిల్లాలో ఏ మేరకు అవినీ

February 24, 2026 / 02:31 PM IST

‘బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’

E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పలువురు మృతి చెందడం, 19 మంది అస్వస్థతకు గురవ్వడం పట్ల మాజీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కల్తీకి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదన్నారు.

February 24, 2026 / 02:30 PM IST

అకాల వర్షం.. అనుకోని నష్టం

SDPT: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పంటలను దెబ్బతీసింది. ముఖ్యంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కొండాపూర్, అందె తదితర గ్రామాల్లో మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై అడ్డంగా చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

February 24, 2026 / 02:30 PM IST

హాస్పిటల్ పనుల ఆలస్యంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను నేడు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. హాస్పిటల్ పనులు జూన్ 2వ తేదీకి పూర్తి కావడం ఆలస్యం అవుతోందని, ఎంజీఎం హాస్పిటల్‌లో గుండె చికిత్సలు, ఆక్సిజన్, మందుల కొరత, వైద్య సిబ్బంది సమస్యలు ఉన్నాయని, ప్రజలకు హాస్పిటల్ సేవలు సేవలు అందకపోవడం ప్రాణాల కోల్పోడానికి కారణమవుతున్నారు.

February 24, 2026 / 02:29 PM IST

పరీక్షా కేంద్రాలలో కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ

GNTR: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆమె పరిశీలించారు. కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిరాల వంటి కనీస వసతులను ఆరా తీశారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు.

February 24, 2026 / 02:28 PM IST

రైతుబంధు ఇక లేనట్లే..!

KMM: క్యాబినెట్ మీటింగ్‌లో రైతుబంధు ప్రస్తావన ఈసారి కూడా రాలేదు. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు ఎన్నికలు అయిపోయి పొలంలో నాట్లు వేయడం కూడా అయ్యేవరకు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. క్యాబినెట్ మీటింగ్‌కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కానీ నేడు ఆ ప్రస్తావన లేదు.

February 24, 2026 / 02:28 PM IST

జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి: PDSU

ATP: గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం PDSU విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో 77ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలో 4200 పోస్టును భర్తీ చేయాలని, విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 02:27 PM IST

ప్రభుత్వానికి బాధ్యత లేదు: బొత్స

AP: పాలు కల్తీ జరిగి మనుషులు చనిపోవడం ఏంటని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. గ్రామస్థాయి నుంచి కూడా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. సభ సజావుగా జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవట్లేదు. అందుకే శాసనమండలి నుంచి వాకౌట్ చేశాం’ అని వెల్లడించారు.

February 24, 2026 / 02:24 PM IST

పసిపాప మృతికి నిరసనగా బీసీ కుల సంఘాల ఆందోళన

NZB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మృతికి నిరసనగా మంగళవారం NZBలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్య వేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించారు.

February 24, 2026 / 02:20 PM IST

రాచకిండంలో అగ్నిప్రమాదం

VZM: బొండపల్లి మండలంలోని రాచకిండంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాలవలస నూకాలు పూరిల్లు కాలిపోయింది. గ్యాస్ లీకేజ్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం వలన సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం అగ్నిమాపకేంద్రం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో మంటలను అదుపు చేశారు.

February 24, 2026 / 02:20 PM IST

బహదూరురాలో నిలిచిన నీరు.. అధికారుల చర్యలు

HYD: రామదేవ్ ఆలయం సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

February 24, 2026 / 02:20 PM IST