• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బంజారాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’

SRPT: హుజూర్ నగర్‌లో బంజారాల ఓట్లతో గెలిచి, వారికే అవకాశాలు ఇవ్వకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానిస్తున్నారని, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారికంగా నిర్వహించవలసిన సేవాలాల్ జయంతి వేడుకలను నియోజకవర్గంలో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. బంజారాలు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు.

February 24, 2026 / 11:28 AM IST

పాఠ్యపుస్తకాల్లో అవినీతిపై పాఠం

NCERT సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 8వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేస్తూ కొత్త అంశాలను చేర్చింది. “న్యాయ వ్యవస్థ” అనే అధ్యాయంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని తొలిసారిగా పరిచయం చేసింది. విద్యార్థులకు దేశంలోని న్యాయ వ్యవస్థలో సవాళ్లు, లోపాలను కూడా వివరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

February 24, 2026 / 11:28 AM IST

కల్తీ పాల వ్యాపారి గణేష్‌కు అస్వస్థత

AP: రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో కలకలం సృష్టించిన కల్తీ పాల ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, గణేష్‌ అస్వస్థకు గురయ్యాడు. రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కల్తీ పాలు తాగి మరో మహిళ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

February 24, 2026 / 11:27 AM IST

కాలువలో దూకి వృద్ధుడు ఆత్మహత్య

PLD: ముప్పాళ్ల మండలం నార్నెపాడు వద్ద మంగళవారం ఉదయం బాలన్న అనే వృద్ధుడు సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే కాలువలోకి దిగి గాలించినా, నీటి ప్రవాహం వల్ల ఆయన ఆచూకీ ఇంకా లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వృద్ధుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 11:27 AM IST

అన్నదాతకు ట్రాన్స్‌‌ఫార్మర్ కష్టాలు.. భుజాలపై మోసిన వైనం

MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌‌ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్‌‌ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

February 24, 2026 / 11:26 AM IST

ట్రాన్స్‌‌ఫార్మర్ కష్టాలు.. భుజాలపై మోసిన వైనం

MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌‌ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్‌‌ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

February 24, 2026 / 11:26 AM IST

నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు

ASF: రెబ్బెన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దేవులగూడ నుండి రెబ్బెన వైపు అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్న ఒక వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన SI వెంకట కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 24, 2026 / 11:25 AM IST

చివరి దశకు చేరుకున్న మావోయిస్టు ఉద్యమం

TG: రాష్ట్రంలో చివరి దశకు మావోయిస్టు ఉద్యమం చేరుకుంది. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో ఇవాళ నలుగురు మావోయిస్ట కీలక నేతలు లొంగిపోనున్నారు. అందులో ఒకరు దేవ్‌జీ.. అలియాస్‌ తిప్పిరి తిరుపతి. దేవ్‌జీ రాడికల్‌ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావో అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లకు చెందిన తిరుపతి భూస్వాముల అణచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు.

February 24, 2026 / 11:25 AM IST

‘డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి’

PPM: జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.

February 24, 2026 / 11:24 AM IST

పాడి పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: MLA

BPT: వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన పాడి పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం అసెంబ్లీలో విమర్శించారు. నిర్మాణ దశలో ఆగిపోయిన వెటర్నరీ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు, అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 11:23 AM IST

డ్రగ్స్ నిర్మూలన సైకిల్ యాత్రలో పాల్గొన్న కలెక్టర్

NTR: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని సూచించారు.డ్రగ్స్ నిర్మూలన కోసం సమాజం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 24, 2026 / 11:23 AM IST

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

BDK: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.

February 24, 2026 / 11:22 AM IST

డేంజర్ జోన్‌లో మన ‘HYD’

HYDలో ఎయిర్ క్వాలిటీలో ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌‌క్వాలిటీ మంగళవారం వట్టినగులపల్లిలో షాకింగ్‌గా 571గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

February 24, 2026 / 11:21 AM IST

11వ వార్డులో పారిశుధ్య పనులు

VKB: పరిగిలోని 11వ వార్డులో అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా కౌన్సిలర్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పర్యటించిన కౌన్సిలర్ ఎండీ అజాజ్ ఆయన మురుగునీరు నిల్వ, నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సహాయంతో నాలాలను శుభ్రపరిచి చెత్తను తొలగించే పనులు చేపట్టించారు.

February 24, 2026 / 11:21 AM IST

వనపర్తి పాత బస్టాండ్ సమస్యలు

WNP: వనపర్తి పాత బస్టాండ్‌లో తాగు నీరు, సరియైన కూర్చీలు, వేచిచూడే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు. కేవలం ఒక షెడ్డు, 4 కుర్చీలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్ బస్సులు బస్టాండ్‌కి రాకుండా రాజీవ్ చౌరస్తాలో ఆగి వెల్లిపోతున్నాయన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని అదికారులను కోరారు.

February 24, 2026 / 11:21 AM IST