నందమూరి బాలకృష్ణతో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య కోసం, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం పూరి చేశాడట. అయితే బాలకృష్ణకు కథ వినిపించాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా, గతంలో వారి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.
KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించి, ఈ నెల 27న జరిగే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ. 10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు.
అన్నమయ్య: జిల్లా జలధార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో జిల్లా జలధార, కలెక్టర్ నిశాంత్ కుమార్ ఫొటోను షేర్ చేసిన సీఎం, ఏడాది కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. 25వ స్థానంలో ఉన్న జిల్లాను రెండో స్థానానికి తీసుకురావడంలో కలెక్టర్ కృషి కీలకమని కొనియాడారు.
AP: కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై నేరాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ‘గంజాయి లేదని హోంమంత్రి అంటున్నారు. మదనపల్లిలో ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి డ్రమ్ములో వేసి చంపారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది’ అంటూ ప్రశ్నించారు.
JN: పాలకుర్తి (M) గూడురు గిరిజన బాలికల వసతి గృహంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. హాస్టల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేసి పసుపు, కుంకుమ, బొమ్మలు లాంటివి వేస్తున్నారని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రాత్రి సమయంలో నిద్ర కూడా పట్టడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
AP: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏడుకొండలు కాదు.. రెండు కొండలు అన్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ గుర్తు చేశారు. పోరాటాలు చేసిన తర్వాత నాటి జీవోను మళ్లీ వెనక్కి తీసుకున్న పరిస్థితి చూశామని తెలిపారు. పింక్ పేరుతో అసత్య ప్రచారం, అభూతకల్పనలు చేసి అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు. కోర్టులో కేసు కూడా దాఖలు చేసి రూ.2 కోట్లు ఫీజు చెల్లించారన్నారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్ వాస్తు విద్యాపీఠాన్ని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అయితే ఈనెల 26న మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రావాలని చైర్ పర్సన్ సిద్ధాంతిని ఆహ్వానించారు.
SRPT: మేళ్లచెరువులో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో జనజీవనం సంధించింది. గాలి దాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మిర్చి ఏరుతున్న దశలో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు రేపు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు.
KMR: పట్టణ పరిధిలోని దేవునిపల్లి పదవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మాధవి రవీందర్ మంగళవారం దేవునిపల్లి నుంచి రామారెడ్డి-ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి 15 మంది అనుచరులతో పాదయాత్రగా వెళ్లారు. వార్డులో ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె వివరించారు.
KDP: వల్లూరు మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో 6వతరగతి ప్రవేశానికి దరఖాస్తులను నేటి నుంచి మార్చి 31 వరకు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సురేశ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12న ఉదయం 10 గంటలకు ఆదర్శపాఠశాలలో పరీక్ష జరుగుతుందన్నారు. ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీలు రూ.100 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
MDCL: రోడ్ల పై రొమాన్స్, స్పా సెంటర్లలో మసాజ్ పేరిట అసాంఘిక కార్యకలాపాలకు KPHB, కూకట్ పల్లి ప్రాంతాలు అడ్డాలుగా మారుతున్నాయి. స్పా సెంటర్లలో క్రాస్ మసాజింగ్ జరుగుతున్నప్పటికీ, కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటివి చెలరేగుతున్నాయని పరిసర ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి రోడ్ల మీద అమ్మాయిలు అందంతో వలవేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
SRCL: మున్సిపల్ కో ఆప్షన్ పదవుల కోసం పలువురు ఆశావహులు నిరీక్షిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు అబ్దుల్ రజాక్, పీర్ మహ్మద్, బాబున్, క్రైస్తవ నాయకులు ఇన్నారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యత్వం కోసం విప్‌తో మంతనాలు జరుపుతున్నారు.
BDK: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ లక్ష్మీదేవిపల్లి, మణుగూరు ఉడతనేని గుంపు గ్రామాల్లో రెండు సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు ఆమోదం తెలిపింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.3 కోట్లు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులతో మహిళా సంఘాలకు స్థిర ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు.
W.G: భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు.
NZB: రేపటి నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.