• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాప్ ద్వారా కిసాన్ డ్రోన్ బుకింగ్

SKLM: రైతులు కిసాన్ డ్రోన్ సేవలను సులభంగా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించిందని వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు శుక్రవారం తెలిపారు. ప్లే స్టోర్‌‌లో లభ్యమయ్యే ‘డ్రీన్ మాట్’ యాప్‌‌ను డౌన్‌ లోడ్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీని ఆధారంగా రైతుల అవసరాలకు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:32 PM IST

పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఒక వరం: ఆడే గజేందర్

ADB: ఇచ్చోడ మండలం మన్నూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి లబ్ధిదారుని ఆహ్వానం మేరకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శుక్రవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గృహ ప్రవేశ పూజల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

February 20, 2026 / 02:30 PM IST

ఛలో సెక్రటేరియట్ పోస్టర్ విడుదల

SRCL: తమ డిమాండ్ల సాధన కోసం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యోగుల ఛలో సెక్రటేరియట్ పోస్టర్‌ను శుక్రవారం వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు కాళిదాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.

February 20, 2026 / 02:30 PM IST

భవిత సెంటర్ అకస్మిక తనిఖీ

E.G: గోకవరం మండల కేంద్రంలో సర్వ శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత సెంటర్‌ని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కనక బాబు శుక్రవారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవిత సెంటర్లో ( మానసిక విద్యార్థుల ) యాక్టివిటీస్‌ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ సేవలను విద్యార్థులకు ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మద్దిపి గ్రామంలో కాలుష్య నీరు సమస్య

సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మద్దిపి గ్రామంలో చెరువు బోరులోని నీరు గత వారం నుంచి కలుషితమై మట్టి నీరు వస్తోంది. కనీసం కడుక్కోవడానికి కూడా వీలులేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన కొత్త బోరును ప్రారంభించి ట్యాంక్‌కు నీరు అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మూసీ సుందరీకరణ.. స్థానికుల సహాయ నిరాకరణ

HYD: గోల్కొండ, రాజేంద్రగనర్, గండిపేట మండలాల పరిధిలో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూములు, స్థలాలు సేకరించాల్సి ఉంది. అయితే స్థానికులు ఇందుకు ససేమిరా అంటున్నారు. తమ స్థలాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్థానికులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూముల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు దాదాపు 1000 నోటీసులు ఇచ్చారు.

February 20, 2026 / 02:25 PM IST

కేసులకు భయపడను.. ఎక్కడా తగ్గను: అంబటి

GNTR: జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరికి ఒక రోజు వస్తుంది తనకు కూడా రోజు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎదిగిన తాను ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తానని తెలిపారు.

February 20, 2026 / 02:25 PM IST

పార్టీ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

TG: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC చీఫ్ మహేష్ గౌడ్‌కు లేఖ రాశారు. ‘మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పరిస్థితులు అనుకూలించకే ఓడిపోయారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఆయనకు అవమానం జరగకుండా చూడాలి. వారికి తగిన గౌరవం దక్కాలి’ అని అన్నారు.

February 20, 2026 / 02:25 PM IST

చికిత్స పొందుతూ మాజీ సర్పంచ్ మృతి

SRD: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కంగ్టి మండలం చుక్కలతీర్థం మాజీ సర్పంచ్ రమేష్ పాటిల్(49) ఇవాళ మృతి చెందారు. ఈ నెల 10న పొలం పనులపై రాసోల్ వెళ్లి తిరిగి రాత్రి తడ్కల్‌కు వెళ్తుండగా ముర్కుంజాల్ శివారులో బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఆస్పత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమించి మరణించారు.

February 20, 2026 / 02:25 PM IST

‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

KRNL: దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో సీఐ వేణుగోపాల్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించరాదని CI వెల్లడించారు.

February 20, 2026 / 02:25 PM IST

నూతన ఛైర్ పర్సన్‌లను సన్మానించిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా వాకిటి మానస హన్మంతు, వైస్ ఛైర్ పర్సన్‌గా కుమారి శైవీ రెడ్డి పదవీ బాధ్యతలు ఇవాళ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరయ్యారు. కార్యాలయంలో పూజల అనంతరం ఇరువురినీ వారి వారి కుర్చీల్లో కూర్చోబెట్టి, సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 20, 2026 / 02:24 PM IST

సూపర్‌-8లోనూ విజయాలు సాధిస్తాం: రజా

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. గ్రూప్‌ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇదే ప్రదర్శనను సూపర్-8లో కొనసాగిస్తామని పేర్కొన్నాడు. S-8లో ఈనెల 23న వెస్టిండీస్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 02:23 PM IST

‘పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలి’

NTR: తిరువూరులో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి ఉద్యోగం చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 02:23 PM IST

మహిళ దీనస్థితిపై స్పందించిన లోకేష్

AP: కడప జిల్లా గోపవరం మండలం పి.పి కుంటకు చెందిన లక్ష్మీనారాయణమ్మ దీనస్థితిపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రసార మాధ్యమాల్లో ఆమె దీనస్థితిపై వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించారు.

February 20, 2026 / 02:23 PM IST

పెంటపాడులో కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట

W.G: పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్రీ కనక దుర్గా దేవి నూతన ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 20, 2026 / 02:21 PM IST