• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలి’

W.G: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబుని కలసి చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో, మారుమూల ఉండటం వలన సరైన ప్రయాణ సాధనాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం అందుకు అవసరమైన చర్యలు చేపడతామని కృష్ణబాబు సానుకూలంగా స్పందించారు.

February 20, 2026 / 02:40 PM IST

వివేకా హత్య కేసు.. విచారణకు అవినాష్ హాజరు

AP: YS వివేకా హత్య కేసుపై CBI కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు MP అవినాష్ సహా మిగిలిన నిందితులు హాజరయ్యారు. నిందితులకు 13 లక్షల ఫైల్స్ ఉన్న హార్డ్‌డిస్క్‌లను CBI అందజేసింది. హార్ట్‌డిస్క్‌లో కొన్ని ఫైల్స్ ఓపెన్ కావట్లేదని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు మార్చి 9కి వాయిదా వేసింది.

February 20, 2026 / 02:39 PM IST

ఆర్థిక సాయం చేసిన ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారానికి చెందిన నిరుపేద నంచర్ల రాము కుమార్తె ఉమ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:39 PM IST

వనపర్తి పురపాలక పీఠంపై మాధవి బాధ్యతల స్వీకరణ

WNP: వనపర్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మిడిదొడ్డి మాధవి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్, నూతన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:38 PM IST

తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు

SRPT: తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు నిర్వహించడం ఆనవాయితీ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మాట్లాడారు. శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

February 20, 2026 / 02:37 PM IST

మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

W.G: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారని అన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

SRCL: చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శుక్రవారం భూమి పూజా చేశారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఆలయ నిర్మాణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు భారతి నగేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలోని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం

RR: షాద్‌నగర్ మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుతీరిన వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు నూతన పాలకవర్గం శాలువతో సత్కరించి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎల్లప్పుడూ వెంట ఉండి ముందుకు నడిపించడంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు, పాలక వర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఆనందం వెళ్లి విరిసింది.

February 20, 2026 / 02:36 PM IST

విఠల్ రెడ్డి చొరవతో దాగం రోడ్డుకు మోక్షం

NRML: తానూరు మండలంలోని దాగం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధికారుతో మాట్లాడి గ్రావెల్ రోడ్డు మంజూరు చేయించారు. ఇందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు విఠల్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

February 20, 2026 / 02:35 PM IST

ఏసీబీకి చిక్కిన కోర్డు సిబ్బంది

BHPL: జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.5 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్) రజిత, కొమ్ము సునీతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఏసీబీని ఆశ్రయించారు.

February 20, 2026 / 02:35 PM IST

కొత్తవలస ఎమ్మార్వోగా రామలక్ష్మీ

VZM: కొత్తవలస మండల రెవెన్యూ అధికారిణిగా ఎస్. రామలక్ష్మీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సోమవారం లేదా గురువారం కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆ స్థానంలో విధులు నిర్వహించిన అప్పలరాజు జిల్లాకలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.

February 20, 2026 / 02:35 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు హర్షిత ఎంపిక

MNCL: రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలకు తాండూర్ మండలం అచ్చలాపూర్ ZPHS విద్యార్థిని చౌల్ల హర్షిత ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో హర్షిత బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయిందన్నారు. ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో హర్షిత పాల్గొంటుందన్నారు.

February 20, 2026 / 02:35 PM IST

సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్

WGL: గీసుకొండ(M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో రెండో విడత సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో ఇవాళ అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల నెలకొన్న సమస్యలు పరిష్కరించి సూచించారు. ఈ కార్యక్రమంలో మెరుగు సుమలత పాల్గొన్నారు.

February 20, 2026 / 02:34 PM IST

అగ్నివీర్ పరీక్షలకు ఉచిత శిక్షణ: కలెక్టర్

PDPL: జిల్లాలో అగ్నివీర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష శుక్రవారం తెలిపారు. ఈనెల 23లోపు అభ్యర్థులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈనెల 25న మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. మే 31 వరకు శిక్షణ ఉంటుందని, టెన్త్ పాసైన 17.5-22 సంవత్సరాల మధ్య వయసుగల పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

February 20, 2026 / 02:34 PM IST

ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి ఆహ్వానం

BDK: ప్రభుత్వ ఐటీఐలో షార్ట్‌టర్మ్‌లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని కొత్తగూడెం ప్రిన్సిపాల్ రమేష్ నేడు తెలిపారు. పీఎంకేవీవై ద్వారా సీఎన్సీ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటర్ కోర్సులకు కొత్తగూడెంలో, సీఎన్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులకు శిక్షణ ఉందన్నారు.

February 20, 2026 / 02:34 PM IST