• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముగిసిన బీటెక్ సెమిస్టర్ పరీక్షలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న బీటెక్ మొదటి సెమిస్టరు పరీక్షలు నేటితో ముగిశాయి. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులకు గాను 71 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో కృషి చేసిన సిబ్బందిని వర్సిటీ ఉన్నతాధికారులు అభినందించారు.

February 20, 2026 / 07:40 PM IST

బీసీ సెల్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు బీసీ సెల్ అధ్యక్షుడు సంగేపు రంగారావు, ప్రధాన కార్యదర్శి వనకూరు విక్రమ్,కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేరేలా కృషి చేయాలన్నారు.

February 20, 2026 / 07:39 PM IST

సేవాలాల్ కృషి చిరస్మరణీయం: మంత్రి

NRPT: సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఊట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో గిరిజనులు నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ రాజు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం సేవాలాల్ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:38 PM IST

ఆ ఘనత ఏపీకే దక్కుతుంది: ఎమ్మెల్యే

KRNL: పేదల సంక్షేమానికి అత్యధికంగా నగదు బదిలీ పథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఏపీ రాష్ట్రానికే దక్కుతుందని ఆదోని MLA పార్థసారథి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి చూపించారన్నారు. గత YCP ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 26 వేల కోట్లు వృథా చేశారన్నారు.

February 20, 2026 / 07:36 PM IST

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్‌లు వీరే..!

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరే జట్లేవో భారత్ మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, టీమ్ బ్యాలెన్స్ ఆధారంగా ఈ నాలుగు జట్లు ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీమిండియా ఈసారి కచ్చితంగా ఫైనల్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

February 20, 2026 / 07:36 PM IST

అంత్యక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సాయం

RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడ శివారులో నివసిస్తున్న పోచమ్మ గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. పోచమ్మ అంత్యక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

February 20, 2026 / 07:35 PM IST

‘నిరంతరాయంగా ఏటీఎం సేవలు’

PDPL: ధర్మారం మండలం నర్సింగాపూర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నిరంతరాయంగా, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని మేనేజర్ శ్యాం కుమార్ శుక్రవారం తెలిపారు. నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలను వినియోగదారులు సెలవు దినాలలో కూడా పొందవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే బ్యాంకు శాఖలో సంప్రదించాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 07:34 PM IST

‘దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేయాలి’

SKLM: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సామూహికంగా దాడి చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. టెక్కలిలోని ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

తిరుమలలో మోసం.. ముగ్గురు అరెస్ట్

TPT: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు తీసుకుని అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో రూ.50/100 చెల్లించి గదులు తీసుకుని, ఒక్కో గదిని రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గదిని పలువురికి ఇచ్చి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహ ఆవిష్కరణ

TG: చింతపల్లి మండలం గోడుకోండ్ల వెంకటేశ్వర్ నగర్ మాల్ ఉడిపి హోటల్ ఎదురుగా ఉన్న ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలునాయక్ ఆవిష్కరించారు. ఈ మేరకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ మనవరాలు శోభ హాజరయ్యారు. గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, పద్మశాలి సంఘం గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

SRPT: కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

February 20, 2026 / 07:31 PM IST

మంత్రిని కలిసిన కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్

KMR: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై మంత్రితో చర్చించగా, కామారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని ఛైర్‌పర్సన్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ఆమె సత్కరించారు.

February 20, 2026 / 07:31 PM IST

BREAKING: వాహనదారులకు అలర్ట్

టోల్‌గేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి టో‌ల్‌గేట్లలో నగదురహిత లావాదేవీలు జరగాలని ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లనే అనుమతించాలని సూచించింది. దీంతో ఇకపై టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతి లభించనుంది.

February 20, 2026 / 07:31 PM IST

ఆదర్శ పాఠశాలలో హెల్ప్ కౌంటర్ ఏర్పాటు

PDPL: ధర్మారం ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సహాయార్థం పాఠశాలలో ఆన్లైన్ చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ తెలిపారు. 2026- 27 సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు చేరే అభ్యర్థులు ఈనెల 28లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 07:30 PM IST

చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తే చర్యలు తప్పవు: SP

ADB: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, డౌన్‌లోడ్ చేసినా, సోషల్ మీడియాలో షేర్ చేసిన, ఆన్లైన్లో చూసిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలియజేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక తీవ్రమైన నేరమని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

February 20, 2026 / 07:30 PM IST