వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ప్రజలు మరోసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు.
TG: రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆదరించారన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నారు.
మెదక్ నుండి ఎల్లారెడ్డి నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బంజారా గ్రామం నుండి తాండూర్ గేటు వరకు ఉన్నటువంటి ఫారెస్టులో గల చెట్లను కామారెడ్డి ఫారెస్ట్ డివిజినల్ ఆఫీసర్ రామకృష్ణ తనిఖీ చేశారు. అలాగే తాండూర్ గేటు సమీపంలో గల ఫారెస్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో గల 11వేల ఒక్క వంద సుమారు మొక్కలను పరిశీలించారు.
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను.. తిరిగి చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
కృష్ణా: మచిలీపట్నంలో బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ కోనా నాగార్జున శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సింహ గర్జన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
NLR: కోవూరు మండలం పడుగుపాడు హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి వెళ్ళిపోయింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: పాతపట్నంకి చెందిన నల్లి పోలయ్యకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ మంజూరు చెయ్యాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను సోమవారం ప్రజాదర్బార్‌లో కలిసి తన సమస్యను వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంటనే స్పందించి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం పోలయ్యకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్‌ను సిబ్బంది అందజేశారు. పోలయ్య కేంద్రమంత్రికు కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: టీడీపీ ప్రభుత్వం ‘రెడ్ బుక్’ రాజ్యాంగంతో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు ఈ నెల 21న ‘చలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
NLG: భారతీయ తపాలా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద, నమ్మకమైన నెట్‌వర్క్ అని నల్గొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్ నరహరి పేర్కొన్నారు. శుక్రవారం నర్సింగ్భట్ల పోస్టాఫీస్‌లో నిర్వహించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. పోస్టాఫీస్‌లోని పలు ప్రభుత్వ పథకాలు, పొదుపు స్కీమ్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఏఐ సమ్మిట్‌లో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు యూత్ కాంగ్రెస్ నేతల కోసం గాలిస్తున్నారు. సుమారు 15కి పైగా వీడియో క్లిప్‌ల ఆధారంగా నిందితులను గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు.
RR: జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందుకూరు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
AKP: గొలుగొండ(మం) చోద్యం వంతెన వద్ద జారిపడిన హ్యాండ్ బ్యాగ్‌ను కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వరరావు బాధితురాలికి అందించారు. బాలారం గ్రామానికి చెందిన గొర్లి నాగమణి కుటుంబంతో వెళ్తుండగా బ్యాగ్ పోగొట్టుకుంది. గ్రామానికి చెందిన ఈర్లి లక్ష్మి దాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం రూ.59,500 నగదు సహా బ్యాగ్‌ను అందజేశారు.
MHBD: తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై అవగాహన కల్పించి తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు సూచించారు. శుక్రవారం గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై తెలియజేసి సక్రమమైన పద్ధతిలో బోధన ఉంటుందన్నారు.
BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ సందర్శించారు. డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన మెటీరియల్, పుస్తకాలు, ఆన్‌లైన్ క్లాసులకు ఐటీడీఏ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చండ్రుగొండ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
BDK: సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్రెడ్డి(20) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జాతీయ రహదారిపై బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ముందు నిలిచిన వాహనాన్ని ఢీకొని పడిపోగా, వెంటనే వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపై దూసుకెళ్లినట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఈ యువకుడి అకాల మరణంతో కుటుంబసభ్యులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.