• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తుర్కపల్లికి తహసీల్దార్ రవికుమార్

BHNG: తుర్కపల్లి మండల తహసీల్దార్‌గా రవికుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ జలకుమారి కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ను తుర్కపల్లి తహసీల్దార్‌గా నియమించారు. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో తహసీల్దార్ సేవలందించిన ఆయనను మరోసారి ఇక్కడికే నియమించడం విశేషం.

February 22, 2026 / 01:27 PM IST

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: స్థానిక ప్రాక్టీసింగ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి రూమ్‌కు వెళ్లి ఆయన పరిశీలించారు. మాస్ కాపీ జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని చెప్పారు.

February 22, 2026 / 01:26 PM IST

సత్తా చాటిన ‘అమరన్‌’, ‘భ్రమయుగం’

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘అమరన్’, ‘భ్రమయుగం’ మూవీలు సత్తా చాటాయి. ‘అమరన్’ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకోగా, ‘భ్రమయుగం’ రెండు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రాల్లో అద్భుత నటన కనబరిచిన హీరోలను ‘ఉత్తమ నటుడు’ అవార్డులు వరించాయి. దక్షిణాది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ...

February 22, 2026 / 01:26 PM IST

10వ వార్డు కౌన్సిలర్ ఆవేదన

NRPT: మద్దూర్ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గోవిందు ముదిరాజ్ ప్రెస్ మీట్లో తనకు ఛైర్మన్ పదవి ఇస్తామని ఏనుముల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఎవరూ.. హామీ ఇవ్వలేదని తెలిపారు. ఛైర్మన్ అవుతాననే నమ్మకంతోనే కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశానన్నారు. బీఆర్ఎస్ నాయకుల విమర్శ తగదని, పార్టీ తుది నిర్ణయమే తన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 01:25 PM IST

అభివృద్ధి పథంలో రాప్తాడు నియోజకవర్గం

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆరు మండలాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతుండగా, జెస్సిపల్లి నుంచి పేరూరు వరకు 54 కిలోమీటర్ల మేర సాగుతున్న పరిటాల రవీంద్ర కాలువ పనులు రైతుల కలలను సాకారం చేస్తున్నాయి. కాలువల ద్వారా చెరువులకు నీరు నింపుతుండటంతో వ్యవసాయ రంగం కళకళలాడుతోంది.

February 22, 2026 / 01:25 PM IST

రేణుక యల్లమాంబకు విశేష పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ రేణుక యల్లమాంబకు ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా.. ఆలయ అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం,పలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర గ్రామాల మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించి అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

February 22, 2026 / 01:24 PM IST

మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

HYD: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బాన్సువాడ బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను బాన్సువాడకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్‌ను మండల బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు.

February 22, 2026 / 01:24 PM IST

రవాణా శాఖ మంత్రికి ఘన స్వాగతం

CTR: రాష్ట్ర రవాణాశాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి రాం ప్రసాద్ రెడ్డికి ఆదివారం డీటీసీ నిరంజన్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. చిత్తూరు పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ భవన నిర్మాణ భూమి పూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

February 22, 2026 / 01:24 PM IST

రేపు ఉంగుటూరులో విద్యుత్ సరఫరా నిలుపుదల

ELR: ఉంగుటూరు గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నారాయణపురం ఏఈ శ్రీరామ్ ఆదివారం తెలిపారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్  ఏర్పాటు, కొత్త విద్యుత్తు లైన్ వేస్తామన్నారు. ఊర చెరువు దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాల వన్, అంబేద్కర్ బొమ్మ దగ్గర, బాబు జగజ్జీవన్ రావు బొమ్మ ఏరియాలో నిలుపుదల చేస్తున్నామన్నారు.

February 22, 2026 / 01:24 PM IST

రేపు సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం

WNP: సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయరాములు తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే జిల్లాలోని ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

February 22, 2026 / 01:24 PM IST

​రేపటి నుంచి సూర్యాపేటలో ‘ప్రజావాణి’

SRPT: ​మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయంలో యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

February 22, 2026 / 01:22 PM IST

అవకతవకలు జరిగితే కఠిన చర్యలు

ASR: జీసీసీ గోడౌన్ నుంచి రేషన్ సరుకులను త్వరితగతిన రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన కృష్ణదేవి పేటలో ఉన్న గోడౌన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం రేషన్ సరుకులను తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 22, 2026 / 01:22 PM IST

‘CM రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత’

ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఆదివారం 117 మందికి రూ. 75 లక్షలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. పేద కుటుంబాల ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎరిక్షన్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 01:22 PM IST

‘మండపేటకు అవార్డు రావడం ఆనందంగా ఉంది’

కోనసీమ: ఐ.వీ.ఆర్.ఎస్ సర్వేలో మండపేటకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభించడం పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉత్తమ ఫలితాలు సాధించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వరుసగా రెండు సార్లు మండపేట మున్సిపాలిటీకి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.

February 22, 2026 / 01:22 PM IST

అంకమ్మ తల్లి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర

గుంటూరు: పొన్నూరు మండలం వెల్లలూరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక మహోత్సవం, పొంగళ్ల నైవేద్య కార్యక్రమంలో ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పండ్లు సమర్పించి ఆశీర్వచనం పొందారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:21 PM IST