• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన

SRCL: మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇంకా పలువురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పరిహారం చెల్లించాల్సి ఉందని నాయకులు కదిరే రాజ్ కుమార్ పాల్గొన్నారు.

February 23, 2026 / 03:00 PM IST

కంభంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ప్రకాశం: కంభం పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మరియు మోటారు వాహన చట్టం (MV Act) ఉల్లంఘనలపై పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.

February 23, 2026 / 03:00 PM IST

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

GNTR: పొన్నూరు పట్టణం 8వ వార్డు నార్త్ క్యాబిన్‌పేటకు చెందిన ఇఊరి శ్రీనివాసరావు (27) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 03:00 PM IST

రేపల్లెలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన RDO

BPT: రేపల్లె మండలంలోని ప్రభుత్వ మరియు జెఎల్‌బి జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను సోమవారం ఆర్డీవో రామలక్ష్మి పరిశీలించారు. పరీక్ష గదులు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.

February 23, 2026 / 03:00 PM IST

రోడ్డు మలుపు.. రోజుకో ప్రమాదం

BDK: కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ప్రమాదకర మలుపు వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా షీ టీమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవేపై ఏర్పాటు చేసిన ఈ మలుపు వాహనదారులకు ముప్పుగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందస్తు హెచ్చరిక బోర్డులు, లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇవాళ వాపోయారు.

February 23, 2026 / 02:59 PM IST

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్!

TG: ఇంటర్ పరీక్షలు FEB 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి తీసుకెళ్లకూడదు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి.

February 23, 2026 / 02:58 PM IST

మేం చెప్పులు విడిచే నిరసన చేశాం: లేళ్ల

AP: తాము చెప్పులు విడిచే నిరసన చేసినట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అసలు అపచారం చేస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు. ‘మేం దేవుడి ఫొటోలు విసిరేశామని అబద్ధాలు చెప్పారు. వాస్తవాలు తెలియాలంటే ఫుటేజ్ బయటకు రావాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ‘సభ్యుల హక్కులు హరించేలా కౌన్సిల్ విధానాలు ఉన్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్న వీడియోలో బయటకొచ్చాయి’ అని MLC తోట పేర్కొన్నారు.

February 23, 2026 / 02:56 PM IST

టీఆర్పి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఐలయ్య నియామకం

MHBD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా ఊడుగుల ఐలయ్య యాదవ్ నియమితులయ్యారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ రాష్ట్ర కార్యాలయంలో వారికి సోమవారం నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని ఐలయ్య అన్నారు. నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 02:56 PM IST

బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన

AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీలు, మహిళా సంఘాలు, చిన్నారులు పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని బాలికల ఆరోగ్యం క్షీణించకూడదని, ఎవరు బాల్యవివాహాలను ప్రోత్సహించరాదు అని హెచ్చరించారు.

February 23, 2026 / 02:53 PM IST

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ జగదీష్

అనంతపురంలోని SSBN కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

February 23, 2026 / 02:51 PM IST

FEB 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. 9AM నుంచి 12PM వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 02:51 PM IST

పీ4తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు

AP: P3తో సంపద సృష్టిస్తున్నాము కానీ ఆర్థిక అసమానతలు తగ్గించలేకపోతున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘పీ4తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. దీంతో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. 2047 నాటికి భారత్ అగ్రదేశంగా తయారవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అసమానతలు ఉండొద్దని ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 90 శాతం విజయాన్ని మనకు అందించిన ప్రజల కోసం మనం కృషి చేయాలి’ అని తెలిపారు.

February 23, 2026 / 02:51 PM IST

గద్వాల కలెక్టర్ ప్రజావాణికి 82 పిర్యాదులు..

GDWL: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకూడదని కలెక్టర్ సూచించారు.

February 23, 2026 / 02:50 PM IST

పోలీసు ప్రజావాణికి సోమవారం 19 ఫిర్యాదులు

MBNR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారలు నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీసు ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు పోలీసు ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ వెల్లడించారు.

February 23, 2026 / 02:48 PM IST

అందుకే లడ్డూ కల్తీపై చర్చించాలి: బొత్స

AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఈ నెల 26న మండలిలో చర్చ జరుగుతుందని MLC బొత్స సత్యానారాయణ వెల్లడించారు. ఇందాపూర్ సంస్థ రూ.560 ఇచ్చే నెయ్యిని తిరుమలలో రూ.658లు ఇస్తున్నారు.హోల్‌సేల్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానానికి తక్కువ ధరకు రావాలి కానీ, రూ.100 అధికంగా ఎందుకు తీసుకుంటున్నారు. CM నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేసినందుకే మేము చర్చించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.

February 23, 2026 / 02:45 PM IST