• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అహోబిలంలో హుండీ ఆదాయం లెక్కింపు

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం ఆలయంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవా సమితి సభ్యులు పాల్గొని కానుకల లెక్కింపులో తమ సేవలు అందించారు.

February 23, 2026 / 03:33 PM IST

ఆర్టిస్టులుగా మమ్మల్ని గుర్తించండి: భార్గవి

గాయత్రి భార్గవి నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడుటలేదు’ సిరీస్‌లో నటించింది. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాం. అవకాశాలిస్తే తినేస్తాం. మేం కూడా ఉన్నామని గుర్తించండి. విమానమే ఎక్కి రావక్కర్లేదు.. లోకల్‌గా కార్లు, ట్రైన్లు కూడా ఎక్కి వచ్చి చేయొచ్చు’ అని తెలిపింది.

February 23, 2026 / 03:33 PM IST

పెద్దయిపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభం

MBNR: బాలానగర్ మండలం పెద్దయిపల్లిలో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని, దశలవారీగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

February 23, 2026 / 03:32 PM IST

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: సిద్ధిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన చిక్కుల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఉత్తమ్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు.

February 23, 2026 / 03:30 PM IST

ఫిరంగిపురంలో అంగన్వాడీల రిలే దీక్షలు

GNTR: ఐసీడీఎస్ బడ్జెట్ పెంపుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో అంగన్వాడీలు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి. రమణ ప్రారంభించారు.

February 23, 2026 / 03:30 PM IST

అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

కృష్ణా: మొవ్వలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు ఈరోజు ప్రారంభించారు. 2023లో అంగన్వాడి వర్కర్స్ 42 రోజుల పాటు సమ్మె నిర్వహించగా, గత ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం మినిట్స్ కమిటీ ఏర్పాటు చేసి ఆమోదించినప్పటికీ, కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించలేదన్నారు.

February 23, 2026 / 03:30 PM IST

నందిగామలో RDO ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు

NTR: ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నందిగామ RDO ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టరు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గోపాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 1810 మినీవర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు.

February 23, 2026 / 03:29 PM IST

‘పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

MDCL: అల్వాల్‌లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలనే ఉద్దేశంతో సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం హెచ్ఎం డబ్ల్యూ SSB అధికారులు ఈడి పంకజ, GM సునీల్‌లను కలిసి అల్వాల్ ప్రాంతానికి మంజూరైన పెండింగ్‌లో ఉన్న తాగునీరు, మురుగు కాలువల పనులపై విస్తృతంగా చర్చించారు.

February 23, 2026 / 03:29 PM IST

చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం మార్పు

BHNG: చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం నూతన భవనానికి మార్చినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో సోమవారం నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రెవెన్యూ పనుల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త భవనానికే రావాలని ఆమె సూచించారు. మార్పును గమనించాలని తెలిపారు.

February 23, 2026 / 03:29 PM IST

’10 పరీక్షలకు 24, 658 మంది విద్యార్థులు’

SRD: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 123 పరీక్షా కేంద్రాల్లో 24,658 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.

February 23, 2026 / 03:27 PM IST

రెబ్బెనలో వర్షం.. అన్నదాతల ఆందోళన

ASF: రెబ్బెన మండలంలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. చేతికి వచ్చిన పత్తి పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షం వల్ల పంట నేలపాలైందని, పెట్టుబడి కూడా దక్కేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:27 PM IST

అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం పూలకుంటపల్లి పెద్ద తండా గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడుకు ఈ నెల 27, 28 తేదీలలో జరిగే శ్రీ శ్రీ టకరమ్మ, శ్రీ భనకమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 23, 2026 / 03:27 PM IST

ధర్మవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సత్యసాయి: ధర్మవరంలో టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ సోమవారం పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన 26 చెక్కులను అందజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తోందని తెలిపారు.

February 23, 2026 / 03:26 PM IST

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు

WGL: నల్లబెల్లి GP ఆవరణంలో ఇవాళ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబారావ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యమకారులను కనీసం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి బాసటగా నిలుస్తానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.

February 23, 2026 / 03:25 PM IST

అభివృద్ధి పనులకు భూమి పూజ

ADB: తలమడుగు మండలం కజ్జర్లలో ఉపాధి హామీ నిధులు రూ. 25 లక్షలతో మంజూరైన కల్వర్టు, టాయిలెట్ రూమ్స్ పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి ఈ పనులను ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబన్న, దేవారెడ్డి, గంగన్న, కమలాకర్ తదితరులున్నారు.

February 23, 2026 / 03:25 PM IST