విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీగా సీహెచ్ అంబేద్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో సిబ్బంది సమక్షంలో బాధ్యతలు చేపట్టి మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. మహిళల భద్రత, ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
KRNL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 823 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప మీడియాకు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 26,102 మంది హాజరయ్యారన్నారు.
ఆసిఫాబాద్ మండలం మాణిక్ వాడలోని 115 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారి రాకేశ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, సిర్పూర్ (టీ), బెల్లంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తి కాగానే సరఫరా పునరుద్ధరిస్తామనన్నారు.
ఏలూరు: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు.
జనగామ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. నాగర్ కర్నూల్ ఘటనను నిరసిస్తూ.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, జఫర్గడ్ ఎమ్మార్వోకు సోమవారం వినతిపత్రం అందించారు. బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతుని మండిపడ్డారు.
AP: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ కోరుకొండ మండలం నరాసాపురానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందంతో కలిసి పాలతయారీ కేంద్రం వ్యాపారి ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో వినియోగదారులు, పశువుల రక్త నమూనాలు సేకరించారు. అలాగే వ్యాపారి ఇంట్లోని వెనిగర్, పాలు, కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.
W.G: నరసాపురం (M) లక్ష్మణేశ్వరంలో శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ భీమవరం డివిజన్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3,52,089 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్. రామచంద్ర కుమార్, ఆలయ చైర్మన్ తెలిపారు.
హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పీ. సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మండలోజు కృష్ణమూర్తి, కోశాధికారిగాక ఐలయ్య, ఉపాధ్యక్షులుగా హసన్ పాషా జీ. వెంకటనారాయణ ఎంపికయ్యారు.
MLG: మహిళా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ప్రకటించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఈ ప్రకటన చేశారు. మండల ఇంఛార్జీలు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు.
కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి అందిన 102 ఫిర్యాదులపై ఎస్పీ వారితో నేరుగా సంభాషించారు. ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దేశిత సమయంలోగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించిన‘PGRS’కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ, సమస్యలను తక్షణమే సంబంధిత అధికారులకు బదిలీ చేసి నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
HYD: సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళ ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడానికి సీఎం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని, ఇది మైండ్ గేమ్ అని ఆయన మండిపడ్డారు. కేరళ ఎన్నికలకు రూ.1000 కోట్లు పంపడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు.
TG: జగిత్యాల జిల్లాకు చెందిన సంగీత, బద్దీ పవన్ 2023లో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో వారిని పెద్దలు కులబహిష్కరణ చేశారు. ఊరిలో ఏ శుభకార్యాలకు రానివ్వకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించలేదన్నారు.
WNP: వీపనగండ్ల మండలంలోని సర్వే నెంబర్ 721లో 16 ఎకరాల 20 గుంటల భూమిని రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని వనపర్తి ప్రజావాణిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడి, శిశువు మృతి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ.. నిందితుడైన సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించి, భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.