కృష్ణా: ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ వి. చందన తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోడి పుంజు, రూ.1,67 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. వివిధ అభివృద్ధి పనులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సత్యసాయి: పాడి రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ‘కమ్యూనిటీ అనిమల్ హాస్టళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, పరిగి, సోమందేపల్లి, అమరాపురంలో ఐదు యూనిట్లను మంజూరు చేశారు. ఒక్కో హాస్టల్‌ను రూ.10 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో 20 పశువులకు వసతి కల్పిస్తారు.
BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించారు. భూమి, పెన్షన్లు, ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేసి ఆదేశించారు.
ASR: జీకేవీధి మండలం కస్తూర్బా గాంధి పాఠశాలలోకి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆ పనులకు సోమవారం ఉదయం ఇసుక తీసుకువచ్చిన వ్యాన్ అదుపుతప్పి గోడ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ విరిగి వాహనం బోల్తా పడింది.
T20 WC సూపర్-8లో భాగంగా ఈనెల 26న జింబాబ్వేతో భారత్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. అలాగే, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే, ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసినట్లే.
కడప: నగరంలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ పార్టీలతో అనుమానితులను గుర్తించే చర్యలు వేగవంతం చేశారు.
TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో మొత్తం 443 అర్జీలు అందాయి. వచ్చిన ప్రతి అర్జీకి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వారి సమస్యలను స్వయంగా స్వీకరించారు.
NLG: చిట్యాల మండలంలోని జీపీ వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణా తరగతులు గుండ్రాంపల్లి రైతు వేదికలో ఇవాళ ప్రారంభమయ్యాయి. 20వ వరకు జరిగే శిక్షణకు ఆరెగూడెం, గుడ్రాంపల్లి, సుంకేనేపల్లి, వెలిమినేడు, ఏపూరు, బొంగోనిచెరువు, పిట్టంపల్లి, పేరేపల్లి, పెద్దకాపర్తికి చెందిన 90 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీవో కోటేష్,యూసుఫ్ పాల్గొన్నారు.
MNCL: క్యాతనపల్లిలో BRS-CPI పొత్తుతో 14 మంది కౌన్సిలర్లు గెలిచినప్పటికీ 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఛైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని TBGKS నాయకులు ఆరోపించారు. సోమవారం మందమర్రిలో మాట్లాడారు. మంత్రి వివేక్‌కు అక్రమ అరెస్ట్‌ల మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి మీద లేదని, పోలీసుల వెనుక దాక్కుని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.
హన్మకొండ నగరంలోని ఎస్ టీ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుబేదారి ఎస్సై ఫణి హాజరై యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473కు తెలియజేయాలని, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని సూచించారు.
ELR: కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతుల సంఘం తెలిపారు. రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు, కౌలు రైతులకు రవాణా కిరాయిలు, హమాలీ చార్జీలు పెంచాలన్నారు.
BDK: మణుగూరు ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేతపై అటవీ శాఖ జిల్లా ఫారెస్ట్ ఏవో కే.ఎస్.ఎన్ మూర్తికి సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సుమారు యాభై సంవత్సరాలు వయసున్న నిద్రమాను చెట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
NLR: మెడికల్ మాఫియాను అరికట్టాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సీపీఐ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైద్యం జరుగుతోందన్నారు. పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్తే వ్యాధి గురించి అడగకుండా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని రోగిని అడిగి వైద్యానికి ఉపక్రమించడం సిగ్గుచేటన్నారు.
NZB: నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా గుండె పోటుతో మరణించారు. పది రోజుల తర్వాత రాజు మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. రాజు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునేలా చూస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చిన NRIలకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.