• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పదో వార్డ్ సమస్యపై స్పందించిన ఛైర్మన్

WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు వివేకానంద కాలనీలోని కాల్వలో మట్టి కూడుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మున్సిపల్ అధికారులకు తెలుపగా, స్పందించలేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి JBC సహాయంతో కాలువ మరమ్మతు పనులు చేయించినట్లు కౌన్సిలర్ తెలిపారు.

February 23, 2026 / 05:39 PM IST

నర్వలో విద్యా కాంప్లెక్స్ సమావేశం

NRPT: నర్వ మండల కేంద్రంలో సోమవారం విద్యా కాంప్లెక్స్ సమావేశం జరిగింది. విద్యార్థుల అభ్యాస పురోగతి, హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రాథమిక విద్యా నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

February 23, 2026 / 05:39 PM IST

జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16, 2026 వరకు SSC పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 05:38 PM IST

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో కలిసి ముచ్చటించారు.

February 23, 2026 / 05:38 PM IST

రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: డిప్యూటీ సీఎం

VKB: దేశ సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వికారాబాద్ అనంతగిరిలో తెలుగు ఉభయ రాష్ట్రాల DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రోహిత్ వేముల ఘటనలో రాహుల్ స్పందించిన తీరు ఆయన సామాజిక స్పృహకు నిదర్శనమని చెప్పారు.

February 23, 2026 / 05:37 PM IST

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

BDK: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

February 23, 2026 / 05:37 PM IST

న్యాయవాదిపై దాడి ఘటనపై న్యాయవాదుల నిరసన

కర్నూలు: న్యాయవాది పవన్ కుమార్‌పై జరిగిన పోలీస్ దాడిని ఖండిస్తూ ఎమ్మిగనూరు న్యాయవాదులు విధులను బహిష్కరించి సోమవారం నిరసన తెలిపారు. స్థానిక కోర్టు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీదుల్లా మాట్లాడుతూ, సంబంధిత సిఐపై వెంటనే సస్పెన్షన్ విధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:37 PM IST

అర్జిత్ సింగ్‌ పాడటం ఆపొద్దు: అమీర్

స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రొఫెషనల్ సింగర్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. అర్జిత్ సింగ్‌ను కలిసి పాటలు పాడటం ఆపొద్దంటూ స్వయంగా కోరాడు. ముర్షిదాబాద్‌లోని అర్జిత్ సింగ్ నివాసానికి వెళ్లిన అమీర్.. ‘నువ్వు పాటలు పాడటం ఆపేస్తే మేము ఏమైపోతాం?’ అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం.

February 23, 2026 / 05:36 PM IST

రాజాపేటలో యూరియా కోసం రైతుల‌ నిరసన

BHNG: రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ మాట్లాడుతూ.. యాప్‌లో యూరియా బుక్ చేసుకుందామనుకుని ఓపెన్ చేసే క్రమంలో సెకండ్లలో యూరియా ఖాళీ అయిపోతుందన్నారు. దీంతో రైతులకు యూరియా లభించడం లేదన్నారు.

February 23, 2026 / 05:34 PM IST

మెనూ చార్జీలు పెంచాలని అంగన్వాడీ సిబ్బంది దీక్ష

TPT: సత్యవేడు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలు సరిపోవడం లేదని CITU నాయకుడు రమేష్ పేర్కొన్నారు. వేతనాలు పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉచిత గ్యాస్ సరఫరా తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.

February 23, 2026 / 05:34 PM IST

‘పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వాలి’

AKP: దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన, విధి నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దీనికి రూ.2.42 లక్షల విరాళాన్ని కలెక్టర్‌కు మెప్మా పీడీ సరోజినీ సోమవారం అందజేశారు.

February 23, 2026 / 05:34 PM IST

లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

NZB: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్య తాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.

February 23, 2026 / 05:34 PM IST

నర్సీపట్నంలో సంత్ గాడ్గే బాబా జయంతి

AKP: నర్సీపట్నం ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కిల్లాడ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాలకొండయ్య మాట్లాడుతూ.. సంత్ గడ్గే బాబా అణగారిన వర్గం రజక కులం నుంచి వచ్చిన మహోన్నత పురుషుడు అని కొనియాడారు. భారతదేశంలో రాజకీయపార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు.

February 23, 2026 / 05:33 PM IST

ఈత చెట్ల నరికివేతపై ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు

NLG: దేవరకొండ మండలం తాటికోల్ లో వెంచర్ డెవలప్మెంట్ పేరుతో ఈత చెట్లు నరికివేశారని బీసీ సంఘం, గౌడ సంఘం నాయకులు ఎక్సైజ్ అధికారికి సోమవారం పిర్యాదు చేశారు. గౌడ సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులు ఉపాధి కోల్పోతారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

February 23, 2026 / 05:33 PM IST

AI సాంకేతికతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో అధికారులకు క్లాడ్ (Claude) AI సాంకేతికతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరిపాలనలో వేగం, ఖచ్చితత్వం పెంచేందుకు ఎక్సెల్, నివేదికల తయారీలో ఈ AI సాధనాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో AI టూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

February 23, 2026 / 05:33 PM IST