KNR: శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో చందు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గద్దపాకకు చెందిన గర్భిణి ప్రసవం కోసం రావడంతో ఆమెకు మనోధైర్యం కల్పించి, మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారులు డా. శ్రావణి పాల్గొన్నారు.
AP: అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తున్నట్లు మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబటి గొంతు నొక్కాలనుకోవడం అవివేకమని అన్నారు. అంబటి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.
SKLM: డయేరియా వ్యాధి గ్రస్తులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిస్థాయి వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. డయేరియా ప్రభలిన ప్రాంతాల్లో సీపీఎం బృందం మంగళవారం పర్యటించారు.
E.G: రాజమండ్రిలో అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని CITU జిల్లా నాయకులు ఎస్.ఎస్ మూర్తి సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, గ్రాడ్యుటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లివ్, మే నేల అంత వేసవి సెలవులు ఇస్తూ GO విడుదల చేయాలన్నారు.
ఆవు, గేదె పాలపై రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ చేసిన వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.’ ఆవు దూడ జ్ఞానవంతురాలు, కానీ గేదె దూడ మేధోపరంగా అవినీతిపరుడు’ అని అన్నారు. ‘పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే ఆవుపాలు, సోమరిగా ఉండాలంటే గేదె పాలు తాగించాలి’ అని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
PPM: జిల్లాలో మార్చి 2వ తేదీ నుండి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలన్నారు.
PDPL: మిర్జాపూర్లో ఇవాళ నిర్వహించిన ‘సంఘటన సృజన అభియాన్’ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన గ్రామస్థులతో సమావేశమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో గత 15 రోజుల్లో ఐదు చోట్ల దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. SC కాలనీలో బంగారు ఆభరణాలు, చికెన్ సెంటరులో నగదు అపహరణకు గురవ్వగా, సోమవారం రాత్రి ప్రధాన రహదారిపైన ఉన్న కిరాణా దుకాణంలో రూ. 50 వేల నగదు చోరీకి గురైంది. వరుస ఘటనలతో రాత్రి వేళల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
ICC ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. జూలై 5న లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది.
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి సొంత ఇంటి కల నిజం చేస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
KMM: సత్తుపల్లి భారీ సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సుమారు రూ. 547 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలున్న ఈ నిందితులు అమాయకుల ఖాతాల ద్వారా నగదును విదేశాలకు మళ్లించారని తెలిపారు.
AP: శాంతిభద్రతలు కాపాడతామనే నమ్మకంతోనే కూటమిని ప్రజలు గెలిపించారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలు లేకనే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని అన్నారు. శాంతిభద్రతలు బాగుండటం వల్లే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25 శాతం వరకు తగ్గాయని హోంమంత్రి వెల్లడించారు.
KRNL: ఆదోని బావాజీ పేట రెండో వార్డ్‌లో రూ. 800,000 విలువైన కొత్త డ్రైనేజ్ పనులు ఇవాళ ప్రారంభించబడ్డాయి. డాక్టర్ వాల్మీకి ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు ఈ పనుల ప్రారంభానికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ నయం, ఏఈ, డీఈ, కాంట్రాక్టర్ రఘు, వార్డ్ కౌన్సిలర్ ఏవి సురేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SRCL: నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో మంగళవారం టాస్క్ ఫోర్స్ సీఐ నటేష్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వేములవాడ పట్టణంలో పలు కిరాణా, సూపర్ మార్కెట్, పాన్ షాప్‌లలో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ సిగరేట్ల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు, దాడులు నిర్వహిస్తున్నామన్నారు.
అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాలకు కైలాసగిరిలో నిర్వహించిన వార్షిక డీ మొబలైజేషన్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. 15 రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.