లవ్ స్టోరీ, బంగార్రాజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్నాడు నాగచైతన్య. ‘థాంక్యూ’ మూవీతో పాటు బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా.. చైతన్యను నిరాశ పరిచాయి. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్‌తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్లో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. NC22 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇందులో చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. స్టార్ క్యాస్టింగ్‌ని తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు మేకర్స్. అలాగే వర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు వెల్లడించారు. ఇక మెయిన్ విలన్‌గా సీనియర్ హీరో అరవింద్ స్వామి కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
NC22కి ‘302’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో 100% లవ్ టైటిల్‌తో వచ్చిన చైతన్య మంచి హిట్ అందుకున్నాడు. దాంతో కథ ప్రకారం NC22కి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని.. పైగా నెంబర్ టైటిల్ తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడట చైతూ. అందుకే 302 టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని.. త్వరలోనే అధికారికరంగా ప్రకటించనున్నారని టాక్.