మంచు విష్ణు(manchu vishnu)ను ఎవరు ట్రోల్(trolling batch) చేస్తున్నారు.. అసలెందుకు చేస్తున్నారు.. ఆ అవసరం ఎందుకొచ్చింది.. సినిమా రిలీజ్‌కు ముందే నెగెటివ్ రివ్యూలు ఎందుకు రాస్తున్నారు.. అసలు విష్ణుపై ఎందుకంత ద్వేషం.. అనేది మంచు విష్ణు ఆవేదన. అందుకే ఎట్టకేలకు తనపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారి చిట్టా విప్పాడు. మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం ‘జిన్నా’ ఈ వారమే థియేటర్లోకి రానుంది.
పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు.. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా థియేటర్లోకి రాకముందే.. కొందరు నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని మండిపడ్డాడు విష్ణు. గత కొద్ది రోజులుగా.. తనపై కావాలనే కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారని.. వారెవరో తనకు తెలుసని చెబుతూ వస్తున్నాడు విష్ణు. కానీ ఆ ఛానెల్స్ గురించి బయటికి చెప్పలేదు. అయితే ఇప్పుడు జిన్నా రిలీజ్‌కు ముందే.. ఫేక్ రివ్యూలు ఇస్తున్న కొన్ని యూట్యూబ్ చానెళ్లను గుర్తించాడు విష్ణు.
అంతేకాదు వాటి వివరాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అనుకున్నదే జరుగుతోంది.. ‘పెయిడ్ బ్యాచ్’ ఇదే.. జిన్నా ఇంకా రిలీజ్ కూడా కాలేదు.. వీళ్లు మాత్రం నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంత ద్వేషం.. త్వరలోనే ఆ చానెల్స్‌ను మూసివేస్తామని..’ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయా యూట్యూబ్ చానెళ్ల పేర్లు కూడా ప్రస్తావించాడు. దాంతో విష్ణు చెప్పినట్టుగానే కౌంటర్ ఎటాక్ ఇవ్వబోతున్నారనే చెప్పొచ్చు. ఇకపోతే.. జిన్నాసినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు విష్ణు. మరి ఈ సినిమాతో విష్ణు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.