Ex CM కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి.. ఎప్పుడంటే..?
Kiran Kumar Reddy : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ ముఖ్యమంత్రి ఆయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా... ఆయన తర్వాత.. ఆ స్థానంలోకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ ముఖ్యమంత్రి ఆయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా… ఆయన తర్వాత.. ఆ స్థానంలోకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత… కాంగ్రెస్ కి దూరమై సొంతంగా ఆయన ఓ పార్టీ కూడా పెట్టారు. అయితే.. ఆ పార్టీ పెద్దగా జనాలను ఆకర్షించలేకపోయింది. దీంతో మళ్లీ కాంగ్రెస్్ లోచేరారు. కానీ… అప్పటికే ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయితే… ఆయన తన రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరో రెండు, మూడు రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బీజేపీలో ఆయన యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది.