హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ఖైరతాబాద్ గణేశుడే. ఈ సంవత్సరం, 70వ వార్షికోత్సవం కావడంతో ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఉత్సవం. సెప్టెంబర్ 7న గణేశ నవరాత్రి ప్రారంభమైన తర్వాత, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, 70 అడుగుల సప్త ముఖ మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఘట్టం, ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం, రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేసుందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై, మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రణాళిక పూర్తయ్యేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, 70 అడుగుల సప్త ముఖ మహా గణపతి విగ్రహం. 70 అడుగుల విగ్రహం కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమం జరిగేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. టాంక్ బండ్ వద్ద 3 పెద్ద క్రేన్లను ఏర్పాటు చేసి, ఈ గొప్ప కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఉత్సవం విజయవంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపట్టబడ్డాయి. భక్తులు, సందర్శకులు సురక్షితంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనగలరు.