»Ingested Microplastics Do Humans Eat One Credit Card Per Week
Microplastics: వారానికో క్రెడిట్ కార్డ్ తింటున్న ప్రజలు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో కీలక విషయాలు
జేబులో ఉండే సెల్ ఫోన్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు అన్నీ ప్లాస్టిక్ తో చేసినవే. మనం ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడినప్పుడు మనకు తెలియకుండానే అవి కొద్దికొద్దిగా విరిగిపోతాయి. విరిగిన ప్లాస్టిక్ దుమ్ము గాలిలో కలిసిపోతుంది.
Microplastics: పాస్టిక్ నియంత్రించాలని ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అది కుదరడం లేదు. ప్లాస్టిక్ వాడకం తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇటీవల కొన్ని పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు నిర్ఘాంతపోవే విషయాలను వెల్లడించారు. వారి పరిశోధనలో ప్రతి మనిషి వారానికి ఓ క్రెడిట్ కార్డు పరిమాణంలో ప్లాస్టిక్ తింటున్నాడట. అంతే ప్రతి మనిషి ప్రతి గంటకు 16.2బిట్స్ మైక్రోప్లాస్టిక్ పీల్చుకుంటున్నాడట. శాస్త్రవేత్తల ప్రకారం మన శరీరం అంతా ఇప్పటికే ప్లాస్టిక్ తో నిండి పోయిందన్నమాట.
నేడు మానవ జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. జేబులో ఉండే సెల్ ఫోన్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు అన్నీ ప్లాస్టిక్ తో చేసినవే. మనం ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడినప్పుడు మనకు తెలియకుండానే అవి కొద్దికొద్దిగా విరిగిపోతాయి. విరిగిన ప్లాస్టిక్ దుమ్ము గాలిలో కలిసిపోతుంది. 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ కణాన్ని (దుమ్ము) మైక్రో ప్లాస్టిక్ అంటారు. అది కంటికి కనిపించదు. కానీ, దానిని పీల్చుకుంటూ ఉంటాము. భూమిపై నీరు, గాలి, నేలలో లక్షల టన్నుల మైక్రో ప్లాస్టిక్ ఉంది. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. గాలిలో ఇంకా వేగంగా పెరుగుతోనే ఉంది. 2022లో మొదటిసారిగా ఈ మైక్రోప్లాస్టిక్ మానవ అంతర్గత శ్వాసకోశ వ్యవస్థలో కనుగొనబడింది. దీని వల్ల మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని ప్రముఖ పరిశోధకుడు మహ్మద్ ఎస్ ఇస్లాం తెలిపారు. ఈ మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి చేరడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ కు మానవ శరీరాన్ని నాశనం చేసే శక్తి ఉందని చెబుతున్నారు. జీవ కణాలను దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.