తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నత పదవీ (సీఎస్)గా ఉన్నారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చి కీలక బాధ్యతలను అప్పగించారు.
క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ సవాల్ చేసింది. 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదోప వాదనలు జరిగాయి. ఇవాళ సీజే జస్టిస్ భూయాన్ బెంచ్ తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. టీఎస్ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. క్యాట్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి కొనసాగింపును రద్దు చేసింది. అయితే తమకు మరింత సమయం కావాలని సోమేశ్ తరఫు లాయర్ ధర్మసనాన్ని కోరారు. దీంతో తీర్పు అమలును 3 వారాలు నిలిపివేసింది. అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. 2019 డిసెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇంతలో హైకోర్టు షాక్ ఇచ్చింది.
ఏపీకి తనను కేటాయించడంపై సోమేశ్ కుమార్ ఇదివరకే క్యాట్‌ను ఆశ్రయించారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ సేవలు అవసరమని భావిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగాలని ట్రైబ్యునల్ సజెస్ట్ చేసింది. దీంతో ఆయన ఏపీ ప్రభుత్వ అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. ఈ నిర్ణయంపై డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో గల ధర్మాసనం విచారించి, ట్రైబ్యునల్ తీర్పును కొట్టివేసింది. సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. మరో 3 వారాల సమయంలో అప్పీల్ చేసుకునేందుకు సోమేశ్ కుమార్‌కు అవకాశం ఉంది.