Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ ఓ బ్యాడ్ న్యూస్!?
Harihara Veeramallu : 'హరిహర వీరమల్లు' ఓ బ్యాడ్ న్యూస్!? : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. ఎప్పటికప్పుడు డిలే అవుతునే ఉంది. పవన్ షూటింగ్లో జాయిన్ అప్పుడల్లా.. ఇక హరిహర వీరమల్లు కంప్లీట్ అయినట్టేనని అనుకుంటున్నారు. కానీ మధ్యలో పొలిటికల్ టూర్‌తో షూటింగ్‌కు బ్రేక్ వేస్తునే ఉన్నాడు పవర్ స్టార్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. ఎప్పటికప్పుడు డిలే అవుతునే ఉంది. పవన్ షూటింగ్లో జాయిన్ అప్పుడల్లా.. ఇక హరిహర వీరమల్లు కంప్లీట్ అయినట్టేనని అనుకుంటున్నారు. కానీ మధ్యలో పొలిటికల్ టూర్‌తో షూటింగ్‌కు బ్రేక్ వేస్తునే ఉన్నాడు పవర్ స్టార్. దాంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అంటూ ఎదురు చూస్తున్న మెగాభిమానులకు నిరాశ ఎదురవుతునే ఉంది. అయితే ఈ సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లోను హరిహర వీరమల్లును రిలీజ్ చేసి తీరుతామని చెప్పుకొచ్చాడు నిర్మాత ఏఎం.రత్నం. కానీ జనవరి 26న రావాల్సిన టీజర్ కూడా రాలేదు. అయితే మహా శివరాత్రి సందర్భంగా టీజర్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. కానీ శివ రాత్రికి హరిహర వీరమల్లు టీజర్ కష్టమే అంటున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే వరకు టీజర్‌తో పాటు.. మరే ఇతర అప్డేట్స్ ఇవ్వకుడదని భావిస్తున్నాడట క్రిష్. అలాగే ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది మాత్రం ఫిక్స్ అంటున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్‌కు ఇంకొన్ని నెలలు ఎదురు చూపులు తప్పవనే చెప్పాలి. అయితే మే నెలలో మాత్రం వినోదయ సీతం రీమేక్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంకా ఈ సినిమా షూటింగే మొదలు కాలేదు. బహుశా ఫిబ్రవరి 14న రెగ్యూలర్ షూట్ మొదలు కానుందని అంటున్నారు. మరి పవన్ నుంచి ఏ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.