ఎట్టకేలకు ఎన్టీఆర్ 30కి ఓపెనింగ్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఇయర్ ఆరంభంలో.. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టి.. 2024 ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. రీసెంట్గా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోను అదే చెప్పాడు తారక్. కాకపోతే ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ చేసి.. మార్చి 20 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. చెప్పినట్టుగానే.. ఇప్పుడు ఎన్టీఆర్ 30కి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందని ఇండస్ట్రీ టాక్. త్వరలోనే దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతోందని అంటున్నారు. ఇక అనుకున్న సమయానికి ఎన్టీఆర్ 30కి కొబ్బరికాయ కొడితే.. మార్చిలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే.. ఆచార్య సినిమాతో ఫస్ట్ టైం ఫెయిల్యూర్ చూసిన కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే స్క్రిప్టు కోసం చాలా సమయం తీసుకున్నాడు. సముద్ర నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఎన్టీఆర్30ని తెరకెక్కించబోతున్నాడు. అంతేకాదు కోలీవుడ్ లేదా బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోని ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చియాన్ విక్రమ్ లేదా సైఫ్ అలీఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫైనల్ అయిందని టాక్. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కొరటాల, అనిరుధ్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది.