AP: తిరుపతి రూరల్ శ్రీనివాసపురం కాలనీకి చెందిన శ్రీవాణి (45) ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీవాణి ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్. ఆమె భర్త కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చికిత్స కోసం ఆమె సెలవు కోరారు. అయితే పరీక్షల సమయంలో సెలవు కుదరని పాఠశాల యాజమాన్యం చెప్పడంతో.. భర్త ఆరోగ్యం కోసం సెలవు పెట్టింది. దీంతో ఆమెను విధుల నుంచి తొలగించడంతో.. ఆత్మహత్య చేసుకున్నారు.