బాపట్ల: రెవెన్యూ సమస్యలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దష్టి సారించాలన్నారు.