RR: శంకర్పల్లి మున్సిపాలిటీలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా మారాయి. చేవెళ్ల నుంచి శంకర్పల్లికి వెళ్లాలంటే ఫతేపూర్ రైల్వే వంతెన దాటి వెళ్లాలి. ఫతేపూర్ బ్రిడ్డి రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో దుమ్ముదూళితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే చెరువును తలపించేలా ప్రధాన రోడ్డు తయారవుతోందని అన్నారు.