SKLM: కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం జిల్లా అంధత్వం నివారణ సంస్థ, శ్రీకాకుళం, ఓ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. కొత్తూరు పారామెడికల్ ఆప్తామాలిక్ ఆఫీసర్ ఇప్పిలి జానకి రామయ్య 95మందికి కంటి పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్సలు అవసరమయ్యే 44 మందిని జేమ్స్ ఆసుపత్రికి తరలించారు.