TPT: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పురపాలక సంఘ కార్మికులకు యూనిఫాం పంపిణీ చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో నూనె, సబ్బులు, శానిటరీ సామగ్రి అందజేశారు. కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.