SS: సోమందేపల్లి మండలంలోని శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపంలో పందిపర్తి పంచాయతీ మంచేపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు క్రిష్టప్ప కుమారుడు (నాగేష్ & పుష్పలత) వివాహ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుక కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు.