MNCL: తాండూర్ మండలం మాదారం టౌన్షిప్ లో గత నాలుగైదు నెలలుగా మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఈ మేరకు మాదారం ప్రజలు రోడ్డుపై బైఠాయించి బుధవారం నిరసన తెలిపారు. ఐదు నెలలుగా నీటి ఎద్దడి సమస్యతో బాధపడుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.