ATP: సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల పేర్లు మీద నకిలీ అకౌంట్లను సృష్టించి, ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారని, నకిలీ అకౌంట్లపై సహ ఉద్యోగులు, జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం మీడియా ద్వారా ప్రజలకు ఒక ప్రకటనలో తెలియజేశారు.