కోనసీమ: అల్లవరం మండలం గుడాల గ్రామానికి చెందిన రాజేష్(24) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్నేహితులతో కలిసి మద్యం సేవించి డీజే సౌండ్ దగ్గర డ్యాన్సులు చేశాడు. మంగళవారం గుండెపోటు రావడంతో రాజేశ్‌ను పేరూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.