TPT: మంగళం పరిధిలోని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీజ్ఞాన సరస్వతి దేవి మందిరాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తూ రిటైరైన కృష్ణమ నాయుడును సత్కరించారు. ఆయన గతంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందజేశారన్నారు.