అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న మరో 295 మందికిపైగా భారతీయులు స్వదేశానికి త్వరలో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఫిబ్రవరి 5న భారత్కు పంపించిన వలసదారుల పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదని వస్తున్న విమర్శలపై కూడా స్పందించింది. ఈ విషయంపై తమ ఆందోళనను అమెరికాకు స్పష్టంగా తెలియజేసినట్లు వెల్లడించింది.