MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రిజర్వేషన్లు పొందిన ఆశావాహులు హైకోర్టు తీర్పు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చాలా మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీల స్థానాల రిజర్వేషన్లు మారాయి.