ఎక్కువగా బిస్కెట్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల బిస్కెట్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిలో పిండి, చక్కెర ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది. ప్యాకెట్‌పై ఎక్స్పైరీ డేట్ చూసి బిస్కెట్లను తినడం మంచిది.