దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.