AP: నటి శ్రీరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు లేఖ రాశారు. ‘ఇటీవల నా వ్యాఖ్యలతో YCPకి చెడ్డపేరు తీసుకొచ్చాను. నా మాటల వల్ల YCPకి ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నా వల్ల మీరు ఎంత బాధపడ్డారో అర్థం చేసుకోగలను. ఇకపై పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉంటాను. నా వల్ల పార్టీకి చెడ్డపేరు రావటం ఇష్టం లేదు. నన్ను క్షమించండి జగనన్నా. వైఎస్ సునీత, షర్మిలను కూడా క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.