నేడు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1947-64 వరకు ప్రధానిగా ఉన్నారు. 1943లో బంగాళా కరువు సమయంలో పంచవర్ష ప్రణాళికలకు ఆజ్యం పోశారు. దేశంలో ఎన్నో IITలను స్థాపించారు. మతం కంటే విజ్ఞానం గొప్పదని నమ్మేవారు. యువతను నూతన శక్తితో అభివృద్ధి బాటలో వెళ్లేందుకు ఆయన చూపిన ప్రేరణ.. ఇప్పటివరకు మనం అనుసరిస్తున్న సమగ్ర విద్యకు ఒక మార్గదర్శకంగా నిలిచింది.