AP: రాష్ట్రంలోని ముఖ్యనేతలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు చేసి అరెస్టయిన వైసీపీ నేత వర్రా రవీందర్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా నందలూరు పోలీసులు అతడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సిద్ధవటం మండలానికి చెందిన వెంకటాద్రి ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై అట్రాసిటీ, ఐటీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.