NRML: సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని దిలావర్పూర్ మండల ఎంపిఓ గోవర్ధన్ అన్నారు. గురువారం మండలంలోని న్యూ లోలం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను వారు పరిశీలించారు. ఎన్యుమరేటర్లు పూర్తి సమాచారాన్ని కుటుంబ సభ్యుల నుండి సేకరించి, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. వీరి వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులున్నారు.