MBNR: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఉన్నతాధికారులనే విచారించగా తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. విచారణలో భాగంగా జిల్లాకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించిన ఆధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.