AP: రుషికొండ ప్యాలెస్లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తలుపుల కోసం రూ.31 లక్షలు, బాత్రూమ్లో కమోడ్ కోసం రూ.11 లక్షలు వినియోగించినట్లు తెలిపారు. రుషికొండ ప్యాలెస్లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ తానెక్కడా చూడలేదన్నారు. అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.