బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.