ప్రకాశం: డిల్లీ పార్లమెంట్ భవనంలోని కమిటీ హాలులో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కేంద్ర గృహ నిర్మాణ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం, నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పాత్రపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల పై ప్రతినిధులతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు.