AP: మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో తిరుమలలో చాలా అపచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పవిత్రత పునరుద్ధరణ జరుగుతోంది. అన్న ప్రసాదాలు స్వీకరిస్తుంటే ఆత్మసంతృప్తి కలుగుతోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యువతకు ఉద్యోగావకాశాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించాను’ అని తెలిపారు.